ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి

SKLM: ప్రజా ఫిర్యాదులు పెండింగ్ ఉండరాదని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు.