ఈ నెల16న డిపోలో జామాయిల్ చెట్ల వేలం

W.G: కొవ్వూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న జామాయిల్ చెట్లకు ఈ నెల 16వ తేదీన వేలం నిర్వహించనున్నట్టు డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 16వ తేదీన అనగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కొవ్వూరు డిపో ఆవరణలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.