కారుణ్య నియామక పత్రాలు అందజేసిన ZP ఛైర్‌పర్సన్

కారుణ్య నియామక పత్రాలు అందజేసిన ZP ఛైర్‌పర్సన్

ELR: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ 23 మంది ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఐదుగురికి పదోన్నతులు, 18 మందికి దిగువ శ్రేణి సహాయకులుగా కారుణ్య నియామకాలు కల్పించారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించడంతోపాటు సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆమె అన్నారు.