సర్పంచ్ ఎన్నికల్లో రెండు తండాలు ఏకగ్రీవం

సర్పంచ్ ఎన్నికల్లో రెండు తండాలు ఏకగ్రీవం

NRPT: ధన్వాడ మండలంలోని రెండు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మందిపల్లి పాత తండా సర్పంచ్ నీల్యా నాయక్, దుడుగుతాండ సర్పంచ్‌గా రాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వారి ఏకగ్రీవం ఖరారైంది. తండాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సర్పంచులు హామీ ఇచ్చారు.