VIDEO: చిన్నారిపై ఆయా పైశాచిక దాడి
MDCL: జీడిమెట్ల PS పరిధిలోని షాపూర్ నగర్‌లో గల ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై ఆయా పైశాచిక దాడికి పాల్పడింది. శనివారం సాయంత్రం నుంచి ఆహారం తీసుకోని ఆ చిన్నారి, తీవ్ర జ్వరంతో ఉండగా హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. వీడియో ఆధారంగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, ఆయాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.