VIDEO: తాడేపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

VIDEO: తాడేపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

GNTR: తాడేపల్లి బోటు యార్డు వద్ద గత అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ఐసర్ లారీ దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఘటనలో ఇల్లు, సామాగ్రి, బైక్ పూర్తిగా ధ్వంసం కాగా పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో సామానంతా పాడైపోవడంతో శుక్రవారం బాధితులు రోదిస్తున్నారు.