ఆర్టీసీ బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు
NRPT: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నారాయణపేట డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. డిపో పరిధిలోని 97 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 146 మంది కండక్టర్లు, 76 మంది డ్రైవర్లు విధులను బహిష్కరించి డిపో ఎదుట బైఠాయించారు. తెల్లవారుజాము నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.