ఎనుమాముల మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డ్‌పై దాడి
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డ్ యాదగిరిపై ఆటోలో వచ్చిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇటీవల మార్కెట్‌లో బయటి వ్యక్తులు వచ్చి మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లిన ఘటనల నేపథ్యంలో, అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని సెక్యూరిటీ గార్డ్ ప్రశ్నించగా వారు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని MGMలో చేర్పించారు.