VIDEO: అక్టోబర్ 7న గజపతినగరంలో బంగారమ్మ పండగ

VZM: గజపతినగరంలో అక్టోబర్ 7న బంగారమ్మ పండగ నిర్వహించేందుకు బంగారమ్మ ఉత్సవ కమిటీ తీర్మానించింది. ఆదివారం గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర గ్రూపు దేవాలయాల ప్రాంగణంలో పండగపై ప్రత్యేక సమావేశం జరిగింది. 23న తొలి చాటింపు, దేవర తేవడం, మరిడమ్మ పండుగ, ఘటాల పూజ ఘటాల ఊరేగింపు ముత్యాలమ్మ పండగ, పరివార దేవతల పండుగ, జెండాలు తోలేల పండుగ నిర్వహిస్తారు.