చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై
ఆసిఫాబాద్: కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామ ఎక్స్ రోడ్డులో ప్రజలకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్తులకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎస్సై చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభినట్లు సర్పంచ్ తెలిపాడు. ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.