తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన బాలసాని రాజయ్య శనివారం తాటి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. యథావిధిగా కల్లు గీసేందుకు వెళ్లగా మోకు జారీ కిందపడిపోయినట్లు తెలిపారు. గాయాలపాలైన రాజయ్యను పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన రాజయ్య కుటుంబానికి పరిహారం చెల్లించాలని గ్రామస్థులు కోరారు.