'అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి'
KDP: బద్వేలు పట్టణంలో అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్పిటల్‌లు నడుపుతున్నారని, అనుమతులు లేని ప్రైవేటు హాస్పిటల్లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలో 10 హాస్పిటల్స్‌కు అనుమతులు వున్నాయని మిగతా హాస్పిటల్స్‌కు అనుమతులు లేవన్నారు.