కొల్లిపర ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీ
GNTR: కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామాలలో ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీ చేశారు. ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం (పీఏసీఎస్), జీడీసీఎంఎస్, ప్రైవేట్ ఎరువుల దుకాణాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ సిద్ధార్థ, ఎస్సై కోటేశ్వరరావు సంయుక్తంగా తనిఖీ చేశారు. డీఏపీ ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.