VIDEO: బొగ్గు లారీని ఢీ కొట్టిన ఇసుక లారీ
NLR: నెల్లూరు-ముంబై హైవేపై మర్రిపాడు మండలం కండ్రిక-నందవరం మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొగ్గు లారీని వెనుక నుంచి వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇసుక లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయినా, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.