VIDEO: రవితేజ సినిమా షూటింగ్ నిలిపివేత
ASR: హీరో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ చింతూరులో ఆర్ధాంతరంగా నిలిచిపోయింది. మావోయిస్టు వారోత్సవాలు కొనసాగుతుండడంతోపాటు ఎడతెరిపి లేకుండా కదలికలు కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు యూనిట్ బృందం బుధవారం రాత్రి అక్కడి నుంచి వెనుదిరిగింది. నెలరోజులపాటు భారీగా చిత్రీకరణ జరపాలని యూనిట్ భావించినట్టు తెలిసింది.