VIDEO: మద్యం మత్తులో వ్యక్తి హంగామ

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలోని ఓ వ్యక్తి మద్యం మత్తులో బుధవారం రాత్రి హంగామ సృష్టించాడు. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి జాతీయ రహదారిపై కత్తులు, బండరాళ్లు, కర్రలతో వచ్చి పోయే వాహనదారులు, స్థానిక గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.