SRSP సాగునీటి విడుదల నిలిపివేత

NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. యాసంగి పంట కాలం సోమవారం పూర్తి కావడంతో నీటి విడుదల నిలిపివేసినట్లు డ్యామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి ఈ నెల 9 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం ప్రస్తుతం 11.44 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.