రాయపర్తిలో పంచాయతీ పన్నుల వసూళ్లు ప్రారంభం
WGL: రాయపర్తి మండల కేంద్రంలో గురువారం ప్రత్యేక అధికారి, MRO ముల్కనూరి శ్రీనివాస్, GP కార్యదర్శి వినోద్, కరోబార్ రామచంద్రయ్యతో కలిసి పన్నుల వసూళ్లు ప్రారంభించారు. MRO శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సకాలంలో పన్నులు చెల్లిస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని శ్రీనివాస్ తెలిపారు.