VIDEO: 'ఆప్కాస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
KKD: ఆప్కాస్ పారిశుధ్య కార్మికులకు బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని సోమవారం కాకినాడలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై మాట్లాడారు. ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం సకాలంలో జీతాలు మంజూరు చేయలేని కారణంగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధలతో సతమతమవుతున్నారన్నారు.