నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
TG: ప్యూచర్ సిటీలో ఇవాళ, రేపు 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' జరగనుంది. మ. 2గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హజరుకానున్నారు. అమెరికా నుంచే 46 మంది రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సహకారం, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలపై సీఎం వివరించనున్నారు.