తీరిన నీటి కష్టాలు.. నీటి వసతి ప్రారంభం

తీరిన నీటి కష్టాలు.. నీటి వసతి ప్రారంభం

NGKL: లింగాల మండలం పద్మనపల్లి గ్రామం 8వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఓ ఫౌండేషన్ అందించిన రూ. 2.50 లక్షల నిధులతో ఇవాళ బోర్ మోటారు, పైపులైను, కూలింగ్ వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ మౌలిక వసతుల కల్పన పట్ల సర్పంచ్ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ వారికి ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవి వెంకటరామ్ పాల్గొన్నారు.