VIDEO: 'కోర్టు కేసుల మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి'
నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయి దారులకు సంబంధిత విభాగాల నుంచి నోటీసులను జారీ చేశామని కమిషనర్ నందన్ సోమవారం అన్నారు. వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో రాబోవు డిసెంబర్ నెల 13న శనివారం నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్‌కు హాజరై కోర్టు కేసులను మాఫీ చేసుకోవాలని తెలిపారు.