ఇఫ్తార్ విందు ఏర్పాట్ల పరిశీలన
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రేపు ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను టీడీపీ నేత దేవినేని ధర్మతేజ మంగళవారం పరిశీలించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ విందును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ధర్మతేజ అన్నారు.