కొనసాగుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ
MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈనెల 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 17 గ్రామాల్లో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. శనివారం ఉ. 7గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిన ప్రక్రియ ప్రారంభించామని మండల ఎన్నికల అధికారి మహేందర్ తెలిపారు.