'భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యం'

భారత్‌కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను చైనాకు దూరం చేసి.. అమెరికాకు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. అమెరికా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులకు భారత్ ప్రధాన మార్కెట్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.