'పవన్, లోకేష్ కృషితోనే ఏపీ అభివృద్ధి'
AP: విశాఖలో నిర్వహించనున్న CII సదస్సును మంత్రి పార్థసారథి పరిశీలించారు. ' సీఎం చంద్రబాబుపై నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తున్నారు. వెళ్లిపోయిన పరిశ్రమలు సైతం వెనక్కి వస్తున్నాయి. పవన్, లోకేష్ కృషితోనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. జగన్ హయాంలో మధ్యలో వదిలేసిన ఇళ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది' అని తెలిపారు.