కూరగాయల ధరల ఊచ్చస్థానం.. బీన్స్ కిలో రూ.200

కూరగాయల ధరల ఊచ్చస్థానం.. బీన్స్ కిలో రూ.200

HNK: పట్టణంలోని ఫాతిమానగర్, కాజీపేట్ రైతుబజార్, కుమార్పల్లి కూరగాయల మార్కెట్లలో కిలో బీన్స్ ధర రూ.200కు చేరింది. దీంతో నగరవాసులు కొనుగోలుకు జంకుతున్నారు. ఇరవై రోజుల క్రితం కిలో రూ.100 ఉండగా, వారం క్రితం రూ.130కి పెరిగింది. గత నాలుగు రోజులుగా రూ.200కు విక్రయిస్తున్నట్లు విక్రయదారులు తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.