రుషికొండ భవనాల వినియోగంపై నివేదిక సిద్ధం

రుషికొండ భవనాల వినియోగంపై నివేదిక సిద్ధం

AP: విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్‌ కమిటీ అధ్యయన నివేదికను సిద్ధం చేసింది. ఈ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ఆదాయ వనరుగా మార్చాలని భావిస్తున్నారు. తాజ్, లీలా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు వీటి నిర్వహణపై ఆసక్తి చూపుతున్నాయి. CM చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ తెలిపారు.