ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. రాగి వైరు చోరీ

CTR: ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైరు చోరీ చేసిన ఘటన శ్రీకావేరిరాజుపురంలో జరిగింది. గ్రామానికి చెందిన అన్బలగన్ షణ్ముగం బోరు బావులకు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. బుధవారం రాత్రి దొంగలు ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులోని ఆయిల్, రాగి తీగలను చోరీ చేశారు. పంటలకు నీళ్లు పారించలేని పరిస్థితి కలిగిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.