కోఠిలో అక్రమ నిర్మాణాలు తొలగింపు
TG: HYD కోఠి, సుల్తాన్ బజార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్లపై ఉన్న ఆక్రమణలను GHMC, ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న దుకాణాలు, షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలను క్లియర్ చేశారు. ప్రజలు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా రోడ్లను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలు మళ్లీ నిర్మించకుండా చర్యలు తీసుకుంటామన్నారు.