ఈపూరులో మిర్చి రైతులకు అవగాహన సదస్సు
PLD: ఈపూరు గ్రామంలో మిర్చి రైతుల అవగాహన సదస్సుకు జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. మిర్చి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నాణ్యమైన దిగుబడులతో రైతులు అధిక లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. రైతులకు అవసరమైన పంట రుణాలు అందించేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందని తెలిపారు.