జూడో పోటీలకు ఎంపికైన విజ్ఞాన్‌ను అభినందించిన కలెక్టర్
SRPT: సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన కర్ర శ్రీ విజ్ఞాన్ జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికవ్వడంపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం అభినందించిన ఆయన.. చిన్న వయసులోనే జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. కేరళ, కలకత్తా, ఢిల్లీలలో జరిగే పోటీల్లో రాణించి అంతర్జాతీయంగా జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.