'యువత రాజకీయాలలోకి రావాలి'

'యువత రాజకీయాలలోకి రావాలి'

ADB: యువత రాజకీయాల్లో పోటీ చేసేందుకు ముందుకు రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలంలోని శ్యాం నాయక్ తండ నూతన సర్పంచ్ జాదవ్ కౌసల్య బుధవారం ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. చదువుకుంటున్న కౌశల్య గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు.