బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన ర్యాలీ

ATP: రాయదుర్గంలో సీపీఎం నేతల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి సరిగా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు.