VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ELR: కొయ్యలగూడెం మండలం బైనగూడెం గ్రామ శివారులో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామం నుంచి నిడదవోలు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వ్యాను, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.