సాయి గూడెం గ్రామంలో మాజీ ప్రధాని జయంతి వేడుకలు

సాయి గూడెం గ్రామంలో మాజీ ప్రధాని జయంతి వేడుకలు

KMR: ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా దేశానికి ఆయన చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.