'దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తిగా పరిష్కరించాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని MLA వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. RDO కార్యాలయంలో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డివో సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తిగా పరిష్కరించాలన్నారు.