VIDEO: మరో భారీ భూకంపం..!

దక్షిణ అమెరికాలోని చిలీ, అర్జెంటీనా దేశాల తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప కేంద్రం అర్జెంటీనాలోని ఉషుయూయా నగరానికి దక్షిణంగా, డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో 10 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ ప్రాంతంలోని మెగల్లన్స్ జలసంధి తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసింది.