VIDEO: బిల్డింగ్ పెయింటర్స్ & ఆర్టిస్టుల సంఘం నిరసన
E.G: కేంద్రం ప్రభుత్వం లేబర్ కోడ్‌ల అమలుకు నోటిఫై చేయటాన్ని నిడదవోలు బిల్డింగ్ పెయింటర్స్ & ఆర్టిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. శనివారం నిడదవోలులో నిరసన చేపట్టి నోటిఫై పత్రాలను దగ్ధం చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు.