అమరావతికి మద్దతుగా పార్లపల్లిలో సంబరాలు
NLR: పార్లమెంట్‌లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదం తెలపడంతో విడవలూరు మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మహిళలు ముగ్గులు వేసి తమ పూర్తి మద్దతు తెలిపారు. పార్లపల్లి గ్రామంలో మండల ఇంఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో టీడీపీ నాయకులు సంబరాలు చేశారు.