పేకాట స్థావరాలపై దాడులు ఐదుగురిపై కేసు

పేకాట స్థావరాలపై దాడులు ఐదుగురిపై కేసు

BHPL: చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు సోమవారం ఎస్సై పోచంపల్లి సతీశ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా, ఐదుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 3,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు లాల్సింగ్, రంజిత్ పాల్గొన్నారు.