బూర్గంపాడు PHCనీ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

బూర్గంపాడు PHCనీ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

BDK: బూర్గంపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య తీరును భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ గురువారం పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున మారుమూల మండలాల ఆదివాసీ గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలోని గిరిజన గర్భిణీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.