కుక్కల దాడిలో గాయపడిన జింక

KDP: మైదుకూరు మున్సిపాలిటీ బద్వేల్ రోడ్డు సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కల బారి నుండి జింకను కాపాడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు అక్కడి చేరుకొని గాయపడిన జింకకు ప్రథమ చికిత్స అందించారు. జింకను స్వాధీనం చేసుకుని ఫారెస్ట్ అధికారులు అడవిలోకి వదిలారు.