నేడు, రేపు రాణీ మల్లమ్మ దేవి పార్కు మూసివేత

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో రాణి మల్లమ్మదేవి మున్సిపల్ పార్కును సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు కమిషనర్ ఎల్. రామలక్ష్మి తెలిపారు. పార్కులో ఉన్న మొక్కలకు పురుగులు మందు పిచికారి చేయనున్న నేపథ్యంలో మూసి వేస్తున్నామని, పురుగుల మందు పిచికారీ తర్వాత పార్క్ యధావిధిగా తెరుస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.