VIDEO: మృతదేహాలను కుటుంబీకులకు అప్పగింత
మార్కాపురం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను డీఎన్ఏ ఆధారంగా కుటుంబసభ్యులకు అధికారులు ఇవాళ అప్పగించారు. పోలీసు బందోబస్తు నడుమ జీజీహెచ్‌లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మృతదేహాలను స్వగ్రామాలకు తరలిస్తున్నారు. కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.