VIEO: డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు
కోనసీమ: అయినవిల్లి మండలంలోని కే. జగన్నాధపురం గ్రామంలోని న్యూ కాలనీ వద్ద డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామంలోని పలుచోట్ల భారీగా నీరు నిలిచిపోయిందని తెలియజేశారు. మురుగునీటి సమస్య లేకుండా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.