రామజోగయ్య శాస్త్రి మన ఉమ్మడి గుంటూరు వారే

GNTR: సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి (1970 ఆగస్టు 24) స్వస్థలం ఉమ్మడి జిల్లా ముప్పాళ్ల. చిన్నతనంలో గాయకుడు కావాలని కలలు కనేవారు. ఐదారు తరగతుల్లో సినిమాల ప్రభావం మొదలైంది. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్. చేశారు. పగలు ఉద్యోగం చేసుకుంటూనే రాత్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేశాడు. యువసేన చిత్రానికి మొదటి సారిగా పాటల రచయితగా పనిచేశాడు.