టెడ్డీబేర్ వేషంతో హల్‌చల్

బాపట్ల: టెడ్డీబేర్ వేషంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెడ్డీబేర్ వేషం వేసుకుని ఓ వ్యక్తి పట్టణంలోని సూర్యలంక రహదారిలో కళాశాల వద్ద ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు వీడియోలు తీస్తున్న మరో ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు.