VIDEO: ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

VIDEO: ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

HYD: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో CM రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8, 9న రెండు రోజులపాటు నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టీ, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.