ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: బేతంచర్ల పట్టణం 1వ వార్డ్ బైటిపేటలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రజలకు పింఛన్లు అందజేశారు. "ప్రతి పింఛన్ మీ భరోసా - ప్రతి రూపాయి మీ అండ" అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడమే తమ ధ్యేయమని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం తన మొదటి కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.